31.7 C
Hyderabad

ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ పార్టీ కార్యాలయంలో  ఎమ్మార్పీఎస్ జిల్లా  సహాయ కార్యదర్శి గా ఏకగ్రీవంగా నియమితులైన  సోంపూర్ పోచిరాం మాదిగను  ఎమ్మార్పీఎస్ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముందుగా ఎమ్మార్పీఎస్ నాయకులు అందరూ ఉద్యమంలో అమరులైన వీరులకు ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత 25  సంవత్సరాలుగా గ్రామస్థాయి అధ్యక్షుడు నుంచి మండల స్థాయి అధ్యక్షులు, నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు, ఎంఆర్పిఎస్ లో ఎన్నో పదవులు సాధించారని తెలిపారు. నిజామాబాద్ లో అంబేద్కర్ భవనంలో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి మాదిగ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ ఆధ్వర్యంలో జిల్లా ఎమ్మార్పీఎస్ సాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం గర్వకారణం అని అనానరు. ఎమ్మార్పీఎస్ మండల నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు అందరూ ఎమ్మార్పీఎస్లో చాలా తెలివైన పాత్ర పోషిస్తూ ఇలాంటి పదవులు మరెన్నో రావాలని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు దావులయ్య, మండల నాయకులు కన్నం శ్రీనివాస్, జండా దినేష్, హస్కుల శ్రీకాంత్, హస్కుల విజయ్, కేడి సాయిలు, ఆర్టీసీ సాయిలు, జెండా ఎంకటి,  విలేఖరి గాయక్వాడ్ రాము, రాజయ్య, రాములు, నాగేష్, రవీందర్, భూమయ్య, హస్కుల విట్టల్, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article