వర్ని, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో గల పెద్దగుట్ట లోని హజ్రత్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ బాబా దర్గాలో ఎమ్మెల్సీ కవిత చాదర్ ను సమర్పించారు. బడా పహడ్ దర్గా ఉర్సు ఉత్సవాలు శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా బాన్సువాడ బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ముందు బడా పహడ్ దర్గాను కాలినడకన సంధర్శించిన కవిత అక్కడ చాదర్ ను సమర్పించారు. కవిత వేంట బోదన్ నియోజకవర్గ ఇంచార్జీ అయోషా, మాజీ టిఎస్ పిఎస్సీ మెంబర్ సుమిత్రా నంధ్ తదితరులు పాల్గొన్నారు.

