బాన్సువాడ, బతుకమ్మ : నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, నస్రుల్లాబాద్ గ్రామాల్లో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో టపాకాయలు కాల్చి , కేక్ కట్ చేశారు. అనంతరం నస్రుల్లాబాద్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. మైలారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్లను, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, నాయకులు గణేష్ ,నర్సింలు గౌడ్, సాయి, సాయిలు, మోసిన్, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
