27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

29న నిజామాబాద్ కు ఎమ్మెల్సీ కవిత

Must read

📰 Generate e-Paper Clip

  • డిచ్ పల్లి నుంచి సుభాష్ నగర్ వరకు భారీ ర్యాలీ
  • బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ: అక్రమ కేసులో బీజేపీ పార్టీ ఎన్ని నిర్భంధాలకు గురి చేసినా మొక్కవోని ధైర్యంతో ప్రజా క్షేత్రంలో పోరాటం సాగిస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 29న నిజామాబాద్ కు వస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 29న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నిజామాబాద్ కు చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో డిచ్ పల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతారని తెలిపారు. అనంతరం బైపాస్ రోడ్డు మీదుగా సుభాష్ నగర్ ఎస్ఎఫ్ఎస్ సర్కిల్ వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

More articles

Latest article