ఎల్లారెడ్డి, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డి మండలం రుద్రారం గ్రామంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని సాయిలు అనే లబ్ధిదారుని ఇంట్లో సహపంక్తి భోజనం చేశారు. ఎమ్మెల్యేతో పటు ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నేం ప్రభాకర్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్,మార్కెట్ కమిటీ చేర్మెన్ రజిత వెంకట్ రాంరెడ్డి, మాజీ మున్సిపాలిటీ చేర్మెన్ కుడుముల సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కురుమ సాయిబాబా, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

