మోర్తాడ్, బతుకమ్మ :
మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన ఈరమణి నిర్మల వెన్నెముక సమస్య తో బాధపడుతూ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. స్థానిక నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెన్నెముక సర్జరీ కోసం రూ.2 లక్షల ఎల్ వో సీ మంజూరు చేయించి శుక్రవారం హైదరాబాద్ లోని నివాసంలో వారి కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా చికిత్స కొరకు ఎల్ వో సీ మంజూరు చేయించిన ఎమ్మెల్యే కు బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
