ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బీజేపీ క్రియశీల సభ్యత్వం తీసుకున్నారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ లోని తన నివాసం లో ఆయనకు పార్టీ నాయకులు సభ్యత్వ రసీదును అందజేశారు. అలాగే రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి సైతం సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమం లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, క్రియశీల సభ్యత్వ నమోదు ఇన్ చార్జి కలిగొట గంగాధర్, బీజేపీ కార్యదర్శి చిన్నారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదులో చురుకుగా పాల్గొని సభ్యత్వం నమోదును విజయవంతం చేయాలని కోరారు.

