30.9 C
Hyderabad
Monday, August 3, 2026

ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ గ్రామ పంచాయితీ పరిధిలో గల వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను జగిత్యాల ప్రాంతానికి తరలింపు రద్దు విషయంలో సహకరించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ప్రస్తుతం కళాశాలలో గల 40సీట్ల సంఖ్య పరిమితిని పెంచుతూ 80 సీట్లను ఏర్పాటు చేసినందుకు గాను గ్రామస్తులు, విద్యార్థులు మండల, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్బర్ నగర్ గ్రామ సర్పంచ్ ముదునూరి సీతారామరాజు, జహీరాబాద్ పార్లమెంటరీ దిశా సభ్యులు నడిపింటి నగేష్, మాజీ సర్పంచ్ రామ గౌడ్, ఉప సర్పంచ్ శంకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సాయిలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రజాక్, కాంతారావు, థామస్ , టీవీ లక్ష్మణ్, మహమ్మద్, ఫాహీమ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article