వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహించనున్నారు. మార్చి 29లోగా ఏపీలోని ఐదుగురు, తెలంగాణకు చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది. మార్చి 3 న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 20న ఎన్నికల జరగనున్నాయి. తెలంగాణ నుంచి మహమూద్ ఆలీ, సత్యవతి రాథోడ్, శేరిసుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ ల పదవీకాలం వచ్చేనెలతో ముగియనుంది.
