నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : భారత్, పాకిస్థాన్ ఉద్రికత్తల నేపథ్యంలో సైనికులకు విజయం చేకూరలని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈమేరకు ఆదివారం జవాన్లకు దేవుడు మనోధైర్యం ప్రసాదించాలని, దేశభూబాగానికి, ప్రజలకు ఎటువంటి నష్టం కలగకూడదని మల్లారం దత్త గుడిలో ఎమ్మెల్యే ధన్ పాల్ ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా పాకిస్తాన్ భారత్ చర్యను భరించలేక దేశంపైన, మన పౌరులపైన దాడులకు పాల్పడటాన్ని భారత్ త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని మళ్లీ భారత్ పై దాడులు చేయడంతో పాకిస్తాన్ వంకర బుద్ధి ప్రపంచదేశాలకు స్పష్టంగా తెలిసిందన్నారు. ప్రపంచ దేశాలు సైతం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ కు మద్దతు ఇస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
