24.7 C
Hyderabad
Monday, August 3, 2026

టీషర్ట్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : ఈ నెల 10,11వ తేదిల్లో జరిగిన అబ్దుల్ కలాం అజాద్ ఇంటర్ డిస్ట్రిక్ అథ్లెటిక్ పోటీలకు సంబంధించిన టీషర్టులను రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి ఆవిష్కరించారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కైసర్ స్పోర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో జరిగే క్రీడా పోటీలలో పాల్గొనే అథ్లెట్ల కోసం రూపొందించిన టీషర్టులను ఆవిష్కరించారు. క్రీడా పోటీల ప్రారంభానికి హాజరవుతానని నిర్వాహకులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల్లో క్రీడా ఆసక్తిని పెంపొందించేందుకు అథ్లెటిక్ లు ఉపయోగపడుతాయని భూపతిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కైసర్ తో పాటు డీసీసీ డెలిగెట్ శేఖర్ గౌడ్, ధర్పల్లి ఎస్సీ సెల్ అధ్యక్షులు మంగ్యా తదితరులున్నారు.

MLA Bhupathi Reddy who launched the t-shirts

More articles

Latest article