24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మిషన్ భగీరథ పైప్ లైన్ మరమ్మతులు చేయించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు
  • బీఎస్పి జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్

 

కామారెడ్డి సిటీ, బతుకమ్మ: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం బంజేపల్లి తాండ, మరియు సోమరంపేట్ గ్రామంలో మిషన్ భగీరథ తాగునీరు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని బిఎస్పి జిల్లా అధ్యక్షుడు మాలోత్ హరిలాల్ నాయక్ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. మిషన్ భగీరథ అధికారులు స్పందించడం లేదు గ్రామపంచాయతీ సెక్రటరీలు పైనుంచి నిధులు రాక లీకేజ్ ఉన్న రైతులను మరమ్మతులు చేయించలేకపోతున్నామని అంటున్నారు. తాగునీటి సమస్య అతి త్వరగా తీర్చాలని  ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. బహుజన సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దంపుర సురేష్ అసెంబ్లీ అధ్యక్షుడు దుబ్బాక నవీన్ ఆచారి రెడ్డి మండలాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article