24.1 C
Hyderabad
Monday, August 3, 2026

యువకుని మిస్సింగ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైనట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం నగరంలోని బైపాస్ రోడ్డులో గల అశోక కాంప్లెక్స్ లో కొత్వాల్ శంకర్ వాచ్ మెన్ గా పనిచేస్తున్నాడు. అతని కుమారుడు కొత్వాల్ రత్నాకర్(17) ఈనెల 23న మధ్యాహ్నం కిరాణా షాపుకు వెళ్తున్నానని చెప్పి బయటి వెళ్లాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కొత్వాల్ శంకర్ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కొత్వాల్ రత్నాకర్ ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు గులాబీ రంగు టీ షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించినట్లు తెలిపారు.   ఆచూకీ తెలిస్తే 87126 59849, 8712659847నంబర్లకు సంప్రదించాలని తెలిపారు.

More articles

Latest article