కామారెడ్డి, బతుకమ్మ : దోమకొండ లో తల్లి కూతుళ్ల మిస్సింగ్ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన తల్లి కళావతి, కూతురు భవాని రెండు రోజులుగా కనిపించడం లేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
