30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

నిజాం సాగర్ నీటిని విడుధల చేసిన మంత్రి ఉత్తమ్

Must read

📰 Generate e-Paper Clip

నిజాం సాగర్, బతుకమ్మ:

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతంగానికి  నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటిని రాష్ట్ర నీటి పారుధల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుధల చేశారు. శుక్రవారం ఉదయం హైద్రాబాద్ నుంచి హెలిక్యాప్టర్ లో వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్, ప్రభుత్వ సలహదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావుతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ వద్ధ హెడ్ స్లూయిస్  గేట్లను ఎత్తి యాసంగి సాగుకోసంనీటిని విడుధల చేశారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, లోకల్ ఎమ్మెల్యేలు మంత్రి ఉత్తమ్ కు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు,బోధన్ ఎమ్మల్యే సుదర్శన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, బాన్సువాడ కాంగ్రెస్ నేత ఎనుగు రవింధర్ రెడ్డి, నీటి పారుధల శాఖ అధికారులు, ప్రాజేక్టు అధికారులు పాల్గోన్నారు.

 

Minister Uttam released Nizam Sagar water

 

More articles

Latest article