నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జీజీహెచ్ కు వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఎంఐఎం నాయకులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఫయాజుద్దీన్ ఆధ్వర్యంలో కలిశారు. ఆస్పత్రిలో వసతులను మెరుగుపర్చాలని, కార్డియో, ఆర్థో తదితర విభాగాల్లో వైద్యులను నియమించాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
