24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మాట నిలబెట్టుకున్న ఎంఐఎం కౌన్సిలర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పేద యువతి వివాహానికి భారీ సాయం

 

. . . కులమతాలకు అతీతంగా సేవే లక్ష్యం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఎంఐఎం అధినేత, బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మరియు బాన్సువాడ పట్టణ అధ్యక్షుడు సయీద్ ఖాన్ పర్యవేక్షణలో బాన్సువాడ 17వ వార్డులో మరోసారి మానవత్వం వెల్లివిరిసింది. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, 17వ వార్డు కౌన్సిలర్ ఫరానాజ్ అబ్దుల్ లయాక్ గారు ఒక పేద యువతి వివాహానికి పెద్ద మనసుతో సాయం అందించారు. వార్డులోని ఒక పేద కుటుంబంలో జరుగుతున్న వివాహ వేడుక కోసం కౌన్సిలర్ ఫరానాజ్ అబ్దుల్ లయాక్ తన సొంత ఖర్చుతో 1 క్వింటాల్ బియ్యం, 5 వేల రూపాయల విలువైన కిరాణా సామాగ్రిని ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు. కష్టాల్లో ఉన్న వార్డు ప్రజలకు అండగా ఉండటమే తమ ప్రాధాన్యత అని ఆమె ఈ సందర్భంగా చాటిచెప్పారు. ఎంఐఎం జిల్లా జాయింట్ సెక్రటరీ అబ్దుల్ లయాక్ మాట్లాడుతూ.. 17వ వార్డులో ఇప్పటివరకు ముగ్గురు పేద యువతుల వివాహాలకు ఈ విధంగా సాయం అందించామని గుర్తు చేశారు. మజ్లిస్ పార్టీ ఎప్పుడూ కులమతాలకు అతీతంగా, పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ వివాహ సాయం పథకం భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతుంది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి మా అండ ఉంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ వార్డు ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ తమపై ఉండాలని ఈ సందర్భంగా మజ్లిస్ నాయకులు కోరారు.

More articles

Latest article