27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

అర్ధ రాత్రి టాస్క్ఫోర్స్ పోలిస్ ల దాడులు

Must read

📰 Generate e-Paper Clip

 పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత

బతుకమ్మ, కోటగిరి :నిజామాబాద్ జిల్లాలో రిసైక్లింగ్ కోసం రైస్ మిల్లుకు వచ్చిన రేషన్ బియ్యంను టాస్క్ పోర్స్ పోలిస్ లు పట్టుకున్నారు. ఈ సంఘటన కోటగిరి మండల కేంద్రంలోని మంగళవారం అర్ధ రాత్రి నిజామాబాద్ పోలిస్ కమీషనర్ అదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఎసిపి విష్ణూ మూర్తి అధ్వర్యంలో ఒక రైస్ మిల్లులో రీసైకిలింగ్ కొరకై తీసుకువచ్చిన అక్రమ పిడిఎస్ బియ్యం లారీని పట్టుకొని సీజ్ చెసి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు.

బుధవారం సివిల్ సప్లై, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించారు. సుమారు 27 టన్నుల పిడిఎస్ బియ్యం పట్టుబడినట్లు విశ్వసనీయ సమాచారం. అంతర్ రాష్ర్ట సరిహద్ధు మండలమైన కోటగిరికి వచ్చిన రైస్ తెలంగాణ కు సంబంధించినదా లేక బిహర్ బియ్యమా అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు సియంఆర్ కోసం కేటాయించిన దాన్యంను మార్కేట్ లో అమ్ముకుని దాని భర్తి కోసం పిడిఎస్ బియ్యం ద్వార రిసైక్లింగ్ కు తరలించడం ఇక్కడ నిత్యం జరిగే తంతుగా మారింది.

Midnight raids by Task Force Police

 

More articles

Latest article