30.2 C
Hyderabad

ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

డిచ్ పల్లి, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇంటర్ జూనియర్ కళాశాలలలో  మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాలని పి డి ఎస్ యూ డిచ్ పల్లి నాయకులు వరుణ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డిచ్పల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పి డి ఎస్ యూ ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాలలో ఉండే పేద మధ్య తరగతి విద్యార్థులు అత్యధికంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో   చదువుకుంటున్నారని, చాలామంది విద్యార్థులు మధ్యానం హోటల్లో  తింటున్నారని మరికొందరు పస్తులు ఉంటున్నారని, పెరిగిన బస్ చార్జీలే కాకుండా  అదనపు ఆర్థిక భారం భరిస్తున్నారని, సంక్షేమ పథకాల కోసం కోట్లు కేటాయిస్తున్నారు కానీ పేద విద్యార్థులు చదువుకునే కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టటం లేదని వెంటనే మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ నాయకులు యశ్వంత్,సాయి కిరణ్, వినీల్,శ్రవణ్, రాజ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article