24.7 C
Hyderabad
Monday, August 3, 2026

బాలికల హాస్టల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

Must read

📰 Generate e-Paper Clip

  • మండలంలో హెల్త్ క్యాంపులు

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని కంబాపూర్, బాలికల వసతి గృహంలో గురువారం డాక్టర్ అర్జున్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ముఖ్యంగా ఈ నెలలో అంటూ వ్యాధులు డెంగ్యూ, టైఫాయిడ్ విష జ్వరాల కారణంగా జిల్లా అధికారుల ఆదేశాలనుసారంకు హాస్టల్ లోనే 98 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.గ్రామాలలో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హెల్త్ క్యాంపులలో విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్న ఉచితంగా మందులు పంపిణీ చేస్తామని అన్నారు. గ్రామాలలో దోమల ద్వారా వచ్చే జ్వరాల బారిన పడకుండా హెల్త్ క్యాంపు ద్వారా ప్రభుత్వము అందించే మందు బిల్లలను  ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అంబయ్య, హాస్టల్ వార్డెన్ గంగా వీణ, హెచ్ ఈ ఓ భూమయ్య, ఏఎన్ఎం చంద్రకళ, ఆశా వర్కర్ సవిత ప్రజలు విద్యార్థులు ఉన్నారు.

 

Medical examination of students in girls hostels

More articles

Latest article