25.2 C
Hyderabad

హబీబ్ నగర్ లో భారీ చోరీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నగరంలోని హబీబ్ నగర్ కు చెందిన హమీద్ అనే వ్యక్తి ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. హమీద్ కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఇంటికి తాళం వేసి నాందెడ్ కు వెళ్లాడు. ఇదే అదునుగా దుండగులు తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. రూ.3.50లక్షల నగదు, మూడు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడు శనివారం ఒకటలో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు.

More articles

Latest article