27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎస్సార్ ఎస్పీలోకి భారీ వరద

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి  3,15,386 క్యూసెక్కుల వరద నీరు వస్తుందని ప్రాజెక్ట్ అధికారి రవి తెలిపారు. దీంతో ప్రాజెక్టు 39 గేట్లు నెత్తి గోదావరిలోకి 3,00,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరద కాలువ ద్వారా 5834, కాకతీయ కాలువ ద్వారా 55 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2500 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, అలీ సాగర్ ఎత్తిపోతల పథకానికి 350 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.50 టీఎంసీలు కాగా గురువారం ప్రాజెక్టులో 1082.00 అడుగులు, 50.706 టీఎంసీల నీరు నిలువ ఉంది.

More articles

Latest article