26.3 C
Hyderabad
Monday, August 3, 2026

చీనూర్ లో కన్నుల పండువగా సామూహిక సత్యనారాయణ వ్రతం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  నాగిరెడ్డిపేట్ : కార్తీక మాసం చివరి సోమవారం మండలంలోని చీనూర్ గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో సోమవారం సామూహిక సత్యనారాయణ వ్రతాలను కన్నుల పండువగా నిర్వహించారు. హలో వేణుగోపాల స్వామి ఆలయంలో వేద బ్రాహ్మణోత్తములు గోపాల చారి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన 35 మంది జంటలు పాల్గొని సత్యనారాయణ వ్రతాన్ని వేద మంత్రోచ్ఛారణాల మధ్య భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం నిర్వహించారు. ఈ సామూహిక సత్యనారాయణ వ్రతాన్ని తిలకించేందుకు చీనూర్ గ్రామంతో పాటు ఇతర గ్రామాల భక్తులు భారీగా తరలివచ్చారు.

More articles

Latest article