నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని హబీబ్ నగర్ లో కరెంట్ షాక్ తో మేస్త్రీ మృతి చెందాడు . ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. నగరంలోని ఆ టో నగర్ కు చెందిన షేక్ ఇమ్రాన్ అనే యువకుడు మేస్త్రీ పని చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే చనిపోయారు. దానితో ఘటన స్థలానికి చేరుకున్న మజ్లీస్ పార్టీ నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని యజమాని, గుత్తేదారుతో చర్చలు జరిపారు. ఈమేరకు స్థానిక ఓకటవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి డేడ్ బాడీని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

