నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఇటీవల నియమితులైన న్యాయవాది నరేందర్ ను బార్ అసోసియేషన్ సన్మానించింది. నిజామాబాద్ బార్ అసోసియేషన్ లో గురువారం శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ జూనియర్ న్యాయవాది గా ఉన్న నరేందర్ భవిష్యత్తులో అనేక మైనటువంటి పదవులు అధిరోహించి ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ , సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాది పిల్లి శ్రీకాంత్,నారాయణదాసు,పరుచూరి శ్రీధర్,నారాయణ, పులి జైపాల్, ఆర్ఎస్ ఎల్ గౌడ్, కేశవులు, సుదర్శన్ రెడ్డి, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
