27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పాఠశాలలో బోరు మోటార్ ను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం బోరు మోటార్ ను మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ షేక్ సాబేర  బేగం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారం రోజుల క్రితం ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తనిఖీ చేశారని అన్నారు.విద్యార్థులకు సరిపడా తరగతి గదులు లేవని నిర్ధారించారు. గతంలో నిర్మాణం చేసి అసంపూర్తిగా వదిలేసిన తరగతి గదులను వెంటనే నిర్మాణం ప్రారంభించి వారం రోజుల వ్యవధిలోని విద్యార్థులకు రెండు తరగతి గదులు అందుబాటులోకి వచ్చే విధంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు.అలాగే విద్యార్థులకు మంచినీటి వసతి లేదని పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవరాజు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే బోరు లక్ష రూపాయల మోటార్ ను అందించారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భాగ్యమ్మ,గ్రామ కార్యదర్శి జాఫర్, పోలీస్ విపిఓ సత్తయ్య, నాయకులు మాజీ ఉపసర్పంచ్ మహేందర్,జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్,  నిమ్మ నారాయణరెడ్డి, దొమ్మాటి రాజు,  నల్ల పరుశురాములు,నిమ్మ మల్లారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article