28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

గంజాయి పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని మూడో టౌన్ పరిధిలో గంజాయి అమ్ముతున్నవారిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. నగరంలోని ఎన్జీఓస్ కాలనీలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచరం మేరకు మూడో టౌన్ ఎస్ఐ  హరిబాబు ఆధ్వర్యంలో దాడి చేసి నిర్మల్ జిల్లా గాజుల నర్సాపూర్ కు చెందిన కోడె సంపత్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి  230గ్రాముల గంజాయి  స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నాందెడ్ నుంచి తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. గంజాయి విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More articles

Latest article