27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లంచం కోసం వేదిస్తు ఏసీబీకి చిక్కిన మంచిర్యాల  సర్వేయర్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . చైన్ మెన్ కూడా అరెస్టు

 మంచిర్యాల, బతుకమ్మ:

మంచిర్యాల జిల్లా కేంద్రంలో  మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంపై ఎసిబి అధికారులు దాడి చేశారు. లంచం కోసం వేధిస్తున్న మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల, చైన్ మెన్ లను ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ అధ్వర్యంలో బుధవారం పట్టుకున్నారు. ఓ భూమి సర్వ తో పాటు పత్రాలు ఇవ్వడానికి బాధితులను డబ్బులు డిమాండ్ చేశారు సర్వేయర్, చైన్ మెన్ లు. ఓసారి రూ.26,500 మరొసారి రూ.16,500 లను ఫోన్ పే చేయించుకున్నారు. ఇంకా రూ.30 వేలు ఇస్తే పనిచేస్తామని డబ్బు ల డిమాండ్ చేయడంతో బాధితులు ఎసిబిని పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హజరుపరుస్తామని ఎసిబి డిఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

More articles

Latest article