- టీయుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఆర్.రమేష్
ధర్పల్లి, బతుకమ్మ : ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులు సక్సెస్ ఫుల్ చెయ్యాలని టీ యు సీ ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్ కోరారు.ఈ మేరకు సార్వత్రిక సమ్మె సక్సెస్ కోసం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) ఆధ్వర్యంలో ముద్రించిన వాల్ పోస్టర్లను మండల కేంద్రంలో ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వ పాలనలో కార్మికుల జీవన ప్రమాణాలు పడిపోయాయన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగినాయని, కానీ కార్మికుల వేతనాలు పెరగలేదన్నారు. కార్మికులకు ఉద్యోగ, ఆరోగ్య భద్రత కరువైందని, మోడీ ప్రభుత్వం అవలంబించిన కార్పోరేట్ కంపెనీల అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలే ఇందుకు కారణమన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కనీస వేతనాల అమలు కోసం, కనీస పెన్షన్ రూ.9వేల అమలు కోసం, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, పనిగంటల పెంపుదలకు వ్యతిరేకంగా,జాతీయ కార్మిక సంఘాలు ఈనెల 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెలో జిల్లాలోని కార్మికులందరూ పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమన్,జీపీ కార్మికుడు కృష్ణ, బీడీ కార్మికులు స్వరూప,రజిని, లక్ష్మి, రజిత, శారద, షాహినా బేగం, మారు,తదితరులు పాల్గొన్నారు.
