కాామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని భూంపల్లి గ్రామంలో పంటలు సమృద్ధిగా పడడంతో ఆదివారం భూంపల్లి లో మాల సంఘం ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్రంలో మైసమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. వరి, మొక్కజొన్న పంటలు చేతికి రావాలని, అధిక లాభాలు రావాలని పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం మైసమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
