29 C
Hyderabad
Monday, August 3, 2026

ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మహిపాల్

Must read

📰 Generate e-Paper Clip

ఇందల్వాయి బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల ఉప సర్పంచుల ఫోరంల మండల అధ్యక్ష,కార్యదర్శులను ఎన్నుకున్నారు. ఉప సర్పంచుల ఫోరం మండల అధ్యక్షునిగా లావుడియా మహిపాల్, ప్రధాన కార్యదర్శిగా సౌందర్య అశోక్, ఉపాధ్యక్షులుగా వడ్ల శీను, సహాయ కార్యదర్శిగా సుదర్శన్, సలహాదారులుగా గంగాధర్, సభ్యులు శ్రీను, సోమల నాయక్, బాలు, భూపతి, వెంకట్, శ్రీను, రవిలు ఎన్నికయ్యారు. ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులుగా ఎన్నికైన మహిపాల్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఉప సర్పంచ్ లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రానున్న రోజులలో అభివృద్ధి పనులు జరిగేలా కృషి చేస్తామని అన్నారు. ఏ గ్రామంలోనైనా ఏ ఉప సర్పంచ్ కి ఆపద వచ్చిన ముందుండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అధ్యక్ష,కార్యదర్శులు, తెలిపారు. ఈ కార్యక్రమంలోమండలంలోని అన్ని గ్రామాల ఉపసర్పంచులు పాల్గొన్నారు.

 

More articles

Latest article