24.7 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ అత్యవసర భేటీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని నివాసంలో శనివారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ( టీపీసీసీ ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డితో మహేష్ గౌడ్ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

More articles

Latest article