ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మహాత్మ జ్యోతిబా పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. అనంతరం జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ్యోతిబా పూలే సమాజంలో సమానత్వం నెలకొల్పేందుకు, విద్యా విస్తరణకు చేసిన కృషి అమూల్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళల విద్యాభివృద్ధికి ఆయన చేసిన సేవలు...