29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు మహాత్మ గాంధీ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

సత్యం, అహింస, ధర్మాన్ని ఆయుధంగా మలుచుకొని అఖండ భారతావనికి స్వాతంత్రం సాధించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద శుక్రవారం బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఇందూర్ చంద్ర శేఖర్, బచ్చు రాము, బేజుగం వెంకటేశం, మహాజన్ విశ్వనాధ్, మహాజన్ చంద్ర శేఖర్,చిదురా మహిపాల్, అశోక్, హరీరామ్, వినయ్, బోయి వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article