26.8 C
Hyderabad

ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

మహా శివరాత్రిని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని రాజరాజేశ్వర ఆలయం, భక్త మార్కండేయ ఆలయం, వీరభద్ర స్వామి ఆలయంతో పాటు సులేమాన్ నగర్ గ్రామంలోని స్వయంభు బసవేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకలను ఆదివారం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. హర హర మహాదేవ శంభో శంకర  నినాదాలతో ఆలయాలు మారుమోగాయి. మహారాత్రి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి.

More articles

Latest article