27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోగొట్టుకున్న సెల్ ఫోన్లను బాధితులకు అందజేసినట్లు మూడో టౌన్ ఎస్ఎచ్ఓ హరిబాబు తెలిపారు. బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడానికి ఒక కానిస్టేబుల్ ను కేటాయించినట్లు తెలిపారు. మూడో టౌన్ పరిధిలో పోగొట్టుకున్న 32 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ లో రిపోర్ట్ చేయాలని, సిమ్ కార్డ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు.

More articles

Latest article