29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

బాధిత మహిళకు ఎల్ఓసీ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన బాధిత మహిళా ఏంపెల్లి గంగామణికి చికిత్స నిమిత్తం మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూ.లక్షా యాభై వేల ఎల్ఓసీని ఇప్పించారు. గుండె సంబంధిత సమస్యతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చేరగా చికిత్సకు రూ. లక్షన్నర ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పగా ఆ విషయాన్నీ స్థానిక బీయర్ యస్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వెను వెంటనే రూ. 1లక్ష 50వేల ఎల్ ఓ సీని బాధిత మహిళా కుటుంబ సభ్యులకు శుక్రవారం హైద్రాబాద్ లోని తన నివాసంలో అందజేశారు.అడగగానే అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థికంగా సహాయం అందించిన ఎమ్మెల్యే కు భాదిత కుటుంబికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article