24 C
Hyderabad
Sunday, August 2, 2026

 ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుంది 

Must read

📰 Generate e-Paper Clip

  • జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

బతుకమ్మ, జుక్కల్ :  ప్రతి రైతుకు రుణమాఫీ వర్తిస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం  టిఆర్ఎస్, బిజెపి పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో జుక్కల్ ఎమ్మెల్యే సమక్షంలో  కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  మాట్లాడుతూ హట్కట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. బీసీలకు కూడా అన్ని విధులుగా అభివృద్ధి చేస్తానని అయన అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగిందని  అన్నారు. జుక్కల్ అభివృద్ధి కోసమే రాజకీయంలో రావడం జరిగిందని  అన్నారు.  గతంలో ఉన్న ఎమ్మెల్యే హన్మంన్ సిందే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మించడం జరిగిందని దాన్ని ప్రారంభించడం మర్చిపోయారని  అన్నారు. నాకు కార్యకర్తలే బలం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయ గౌడ్. జుక్కల్ మాజీ సర్పంచ్ బొంపెల్లి రాములు, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు గంగు నాయక్, హట్కట్ సమాజ్ జిల్లా అధ్యక్షులు వెంకట్రావు, పెద్ద ఏడ్గీ ఎంపీటీసీ సభ్యులు విజయ్ పటేల్, మోహిన్ ఖాన్ కోఆప్షన్ సభ్యులు, మాజీ చైర్మన్ మల్లికార్జున అప్ప బిచ్కుంద, నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Loan waiver is applicable to every farmer

More articles

Latest article