25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్ లో మెరిసిన లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

 

మెండోర, బతుకమ్మ :

 

హైదరాబాద్ లో విశ్వం ఎడ్యుకేషన్ వారు నిర్వహించిన వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్ పోటీలలో లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు పాల్గొని మెరిశారు. మెండోర వేదిక్ మ్యాథ్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఎస్ మణిదీప్ (9వ తరగతి) చక్కని ప్రతిభను కనబరిచి జతీయ స్థాయికి ఎంపికయ్యాడు. వేదిక్ మ్యాథ్స్ విభాగంలో జాతీయ స్థాయి కి ఎంపిక కావడం మణిదీప్ కి ఇది వరుసగా రెండవసారి. అబాకస్ రాష్ట్ర స్థాయీ పోటీలో పాల్గొని కె. హన్విక్ష (5వ తరగతి) మెండోర, హన్సిక (4వ తరగతి) సావెల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయీ జీనియస్ అవార్డు కైవసం చేసుకున్నారు. వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్ రాష్ట్ర స్థాయీ పోటీలో విద్యార్థులు ప్రతిభను చాటడంతో పాఠశాల ప్రిన్సిపల్ అజ్మత్ పాష, అబాకస్ అండ్ వేదిక్ మాథ్స్ ఇన్చార్జి ఆరూప లు ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు అభినందనలు తెలియజేసారు.

 

 

Little Flower students shine in Vedic Maths and Abacus

More articles

Latest article