26.3 C
Hyderabad
Monday, August 3, 2026

జీఓపీఏ ప్రధాన కార్యదర్శి గా లింగాల రాజబాబు గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

గౌడ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (జీఓపీఎ) కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా భిక్కనూరు పట్టణానికి చెందిన లింగాల రాజబాబు గౌడ్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జీఓపీఏ జిల్లా సర్వసభ్య సమావేశంలో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లింగాల రాజబాబు గౌడ్ మాట్లాడుతూ గౌడ సమాజ అభ్యున్నతికి నిరుపేద గౌడ విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలో 5000 సభ్యత్వాల నమోదు లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. జిల్లాలోని గౌడ ఉద్యోగులు అధికారులు ప్రొఫెషనల్స్ ను ఒకే వేదిక పైకి తెచ్చి సేవా కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. తనను ఎన్నుకున్న రాష్ట్ర కమిటీ జిల్లా నాయకత్వం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

More articles

Latest article