నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
లింబాద్రి గుట్ట ప్రాంతం ఆధ్యాత్మికోత్సాహంతో పులకించింది. పవిత్ర లింబాద్రి గుట్టపై అంగరంగ వైభవంగా నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కార్తీకమాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మక ర్తలు నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసుదేవాచార్యులు ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారన్నారు. లింబాద్రి గుట్ట తెలంగాణ ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీక. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేయడం అభినందనీయం. ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాము” అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు బిజెపి సీనియర్ నాయకులు పెదోళ్ళ గంగారెడ్డి , బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు ఇల్లందుల ప్రభాకర్, మఠం పవన్, పవన్ ముందడ, సుగంధం హరీష్,రేణికింది హరీష్ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
