నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో గురువారం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. గ్రంథాలయ అధికారి పూర్ణచందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల్లో కళాశాల ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రఫీక్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగారత్నం, అకాడమిక్ కో ఆర్డినేటర్ డాక్టర్ గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రంథాలయాల వల్ల ప్రయోజనాలు, గ్రంథాలయాల ఉద్యమాలను, గ్రంథాలయాల చరిత్రపై విద్యార్థులకు అధ్యాపకులు అవగాన కలిగించారు. కళాశాల గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శనను నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ సీసీ అధికారి డాక్టర్ రామస్వామి, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ రమేశ్, అకాడమిక్ సమన్వయ కర్తలు రాజేశ్, రాహుల్, అధ్యాపకులు అనసూయ, రమణ, నహీద బేగం, సుభాషిణీదేవి, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థినీవిద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

