26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహించాలి

Must read

📰 Generate e-Paper Clip

. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీ ఆర్, తాను ముఖ్యమంత్రి అయిన తరువాత విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా ప్రవర్తించిన కేసీ ఆర్ కి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రజాకార్ల వారసులైన ఎం ఐ ఎం నాయకులకు భయపడి విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఓ వర్గం వద్ద తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

More articles

Latest article