నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని 24,34,37,39 డివిజన్ లలో మంగళవారం నగర మేయర్ నీతూకిరణ్ తో కలిసి సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అన్ని పార్టీల నాయకులు ముందుండి పని చేయాలని పిలుపునిచ్చారు. ఆయా డివిజన్ ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
