లింగంపేట, బతుకమ్మ : లింగంపేట మండలం మెంగారం, గాంధీనగర్ గ్రామ శివారులో కామారెడ్డి-ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలను వాహనదారులు సెల్ ఫొన్లలో బంధించారు. చిరుత రాత్రిపూట రోడ్డుపై సంచరించడంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా లింగంపేట,ఎల్లారెడ్డి,నాగిరెడ్డిపేట నిజాంసాగర్ మండలాల్లో రోడ్డుపై చిరుతలు సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల పరిధి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
