24.9 C
Hyderabad

చిల్లర్గిలో చిరుత కలకలం

Leopard creates a stir in Chillargi

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పశువులపై దాడి

 

పిట్లం, బతుకమ్మ : 

 

పిట్లం మండలంలోని చిల్లర్గి గ్రామ శివారులో శనివారం రాత్రి రైతు పాశం సుధాకర్ కు చెందిన దూడపై చిరుత దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు. సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత దూడపై దాడి చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బీట్ అధికారి పశువుల యజమాని కుటుంబ సభ్యులను విచారించి వివరాలు నమోదు చేశారు. వెటర్నరీ అసిస్టెంట్ ఆధ్వర్యంలో దూడ మృతదేహానికి పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం ద్వారా మృతికి గల కారణాలను నిర్ధారించారు. చిల్లర్గి శివారులో చిరుత సంచారంతో గ్రామస్తు0ల్లో ఆందోళన నెలకొంది. చిరుతను గుర్తించి పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని, పశువుల రక్షణకు తగిన భద్రత కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

More articles

Latest article