బతుకమ్మ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని పుణె జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పుణె జిల్లా పింపర్ ఖేడ్ గ్రామంలో తమ కుటుంబానికి చెందిన పొలంలో పని చేస్తున్న తాత వద్దకు తాగునీరు తీసుకెళ్తున్న ఐదేళ్ల బాలికపై చిరుత పులి దాడి చేసింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
