- ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తే డీజేలపై కేసు
- ఎస్సై పడాల రాజేశ్వర్
బతుకమ్మ, ఏర్గట్ల : గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి యుతంగా నిమజ్జనం జరుపుకోవాలని నిమజ్జన కార్యక్రమం సజావుగా సాగేందుకు పోలీసుపరంగా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఏర్గట్ల ఎస్సై రాజేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు.పరిమితికి మించి డీ జెలు సౌండ్ పెట్టి ప్రజలకు ఇబ్బంది కలిగించడం, అంతే కాకుండా నిమజ్జన ఉత్సవాల సమయంలో అనవసర అల్లర్లకు పాల్పడటం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేయడం,శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంవంటి వాటి పట్ల కటిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రాజేశ్వేర్ తెలిపారు. నిమజ్జనం శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో,మద్యపానం సేవించకుండ జరుపుకోవాలని గణేష్ మండలి నిర్వాహకులకు సూచించారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే డీజే నిర్వాహకుల మీద,గణేష్ మండలి నిర్వాహకుల మీద చర్యలు తప్పవని హెచ్చరించారు.
