27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ చారి

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

టాలెంట్ టెస్ట్ లో పాల్గొనడం వల్ల మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఇంకా ఏం నేర్చుకోవాలి, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయాలు తెలుస్తాయని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ చారి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్గట్ల లో బుధవారం ఫిజికల్ సైన్స్ మండల్ లెవెల్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్ లో ఇందుజా (కే.జీ.బీ.వీ, ఏర్గట్ల) మొదటి బహుమతి, హర్షిత (కే.జీ.బీ.వీ, ఏర్గట్ల) రెండవ బహుమతి, వైష్ణవి (జెడ్పిహెచ్ఎస్, ఏర్గట్ల) మూడవ బహుమతి గెలుచుకున్నారు. వారికి ప్రధాన ఉపాధ్యాయుడు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజశేఖర్, సుధాకర్, సదానందం, స్రవంతి, భూపతి, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.

More articles

Latest article