25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

11ఏళ్లుగా సెలవు తీసుకొని నాయకుడు మోదీ

Must read

📰 Generate e-Paper Clip

  • అన్నదాతలకు అండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం
  • కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : కేంద్రంలో నరేంద్ర మోదీ  ప్రధాని పదవి చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో గత 11 సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలపై పోటో ప్రదర్శన(ఎగ్జిభిషణ్) ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఈ ప్రదర్శనని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు సాధించిన విజయాలపై ముద్రించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వికసిత భారత్ – 2047 లక్ష్యంపై బిజెపి కార్యకర్తలు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ 11 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకొని నాయకుడు మోదీ అని నిరంతరం దేశ అభివృద్ధికి పాటు పడుతున్న వ్యక్తి అని అన్నారు. అన్నదాతలకు అండగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, ఆర్టికల్ 370 రద్దు వంటి సాహసోపేత నిర్ణయాలు నరేంద్ర మోదీ సొంతం అని అన్నారు. రక్షణ వ్యవస్థ కట్టుదిట్టం చేయడంలో మోదీ ప్రభుత్వం సఫలం అయ్యిందనీ అన్నారు.

Leader Modi has been on leave for 11 years.

More articles

Latest article